1)
శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్తయైన దేవా
- మీకు స్తోత్రములు
1)
నిరాకారమునకు ఆకారము కలుగజేసిన సృష్టికర్తయైన దేవా
- మీకు స్తోత్రములు
1)
నోటిమాటచేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్తయైన దేవా
- మీకు స్తోత్రములు
1)
నోటిమాటచేత సూర్యుని, చంద్రుని, నక్షత్రములను సృష్టించిన సృష్టికర్తయైన దేవా
- మీకు స్తోత్రములు
1)
నోటిమాటచేత భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్తయైన దేవా
- మీకు స్తోత్రములు
1)
నోటిమాటచేత చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్తయైన దేవా
- మీకు స్తోత్రములు
1)
మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు, మీ పోలిక చొప్పున నేలమంటితో నరులను నిర్మించిన సృష్టికర్తయైన దేవా
- మీకు స్తోత్రములు
1)
రాజాధిరాజా, ప్రభువులకు ప్రభువా, దేవాది దేవా
- మీకు స్తోత్రములు
1)
ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షనీయుడా
- మీకు స్తోత్రములు
1)
ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి
- మీకు స్తోత్రములు
1)
పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము గల దేవా
- మీకు స్తోత్రములు
1) సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు స్తుతినొందదగిన నామము గల దేవా - మీకు స్తోత్రములు
1)
అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా
- మీకు స్తోత్రములు
1)
పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడైయున్న దేవా
- మీకు స్తోత్రములు
1)
భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవా
- మీకు స్తోత్రములు
1)
సైన్యములకధిపతియగు యెహోవా పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు అని నిత్యము దేవదూతలచేత కొనియాడబడుచున్న దేవా
- మీకు స్తోత్రములు
1)
సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా
- మీకు స్తోత్రములు
1)
శక్తి చేతనైనను, బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే కార్యము జరుగును అని చెప్పిన దేవా
- మీకు స్తోత్రములు
1)
భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా
- మీకు స్తోత్రములు
1)
నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైన కలదా? అని చెప్పిన దేవా
- మీకు స్తోత్రములు
1)
నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా
- మీకు స్తోత్రములు
1) మారని వాడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా - మీకు స్తోత్రములు
1)
ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని చెప్పిన దేవా
- మీకు స్తోత్రములు
1)
నీ భారము యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా
- మీకు స్తోత్రములు
1)
నీ కోరికను సిద్ధింపజేసి, నీ ఆలోచన యావత్తును సఫల పరచుదును అని చెప్పిన దేవా
- మీకు స్తోత్రములు
1)
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా
- మీకు స్తోత్రములు
1)
మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా
- మీకు స్తోత్రములు
1)
నన్ను ప్రేమించువారిని ఆస్థికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదునని చెప్పిన దేవా
- మీకు స్తోత్రములు
1)
నేను నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను అని చెప్పిన దేవా
- మీకు స్తోత్రములు
1)
నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను అని చెప్పిన దేవా
- మీకు స్తోత్రములు
1)
నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందును అని చెప్పిన దేవా
- మీకు స్తోత్రములు
1)
నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా
- మీకు స్తోత్రములు
1)
తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించి వారిని ఆదుకొనువాడా
- మీకు స్తోత్రములు
1)
ఇశ్రాయేలీయుల మొర ఆలకించి, వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన దేవా
- మీకు స్తోత్రములు
1)
ఎర్రసముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేలమీద ఇశ్రాయేలీయులను నడిపించిన దేవా
- మీకు స్తోత్రములు
1) ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీయులను పోషించిన దేవా - మీకు స్తోత్రములు
1)
బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలీయుల దప్పిక తీర్చిన దేవా
- మీకు స్తోత్రములు
1)
ఇశ్రాయేలీయులను పగలు మేఘ స్థంభమై, రాత్రి అగ్ని స్థంభమై నడిపించిన దేవా
- మీకు స్తోత్రములు
1)
ఇశ్రాయేలీయుల స్తుతుల ద్వారా యెరికో కోట గోడ కూల్చివేసిన దేవా
- మీకు స్తోత్రములు
1)
ఇశ్రాయేలీయుల కనాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిలిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా
- మీకు స్తోత్రములు
1)
ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేర్చిన దేవా
- మీకు స్తోత్రములు
1)
నోవహును తన కుటుంబాన్ని జల ప్రళయము నుండి రక్షించిన ໖໖
- మీకు స్తోత్రములు
1)
బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా
- మీకు స్తోత్రములు
1)
గొర్రెలు కాచుకునే దావీదుని లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా
- మీకు స్తోత్రములు
1)
యెహోషువా ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపిన దేవా
- మీకు స్తోత్రములు
1)
యెహెజ్కేలు ప్రార్ధించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవా
- మీకు స్తోత్రములు
1)
హిజ్కియా ప్రార్ధించగా ఆయుష్యు పొడిగించిన దేవా
- మీకు స్తోత్రములు
1)
ఏలీయా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపిన దేవా
- మీకు స్తోత్రములు
1)
దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతనిని రక్షించిన దేవా
- మీకు స్తోత్రములు
1)
షద్రకు, మేషాకు, అబేద్నెగోలను అగ్నిగుండం నుండి రక్షించిన దేవా
- మీకు స్తోత్రములు
1)
ఎలుగుబంటిని, సింహాన్ని చంపటానికి దావీదుకి శక్తినిచ్చిన దేవా
- మీకు స్తోత్రములు
1)
హనోకు, ఏలీయాలను మరణం లేకుండా పరలోకానికి తీసుకు వెళ్ళిన దేవా
- మీకు స్తోత్రములు
1)
తల్లిదండ్రులు లేని, అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా
- మీకు స్తోత్రములు
1)
అన్యురాలు, విధవరాలైన రూతును ఆదుకొని, ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా
- మీకు స్తోత్రములు
1)
90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలమిచ్చిన దేవా
- మీకు స్తోత్రములు
1)
దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి, మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, రిక్తునిగా చేసుకొన్న యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడై ఉండుటకు దిగి వచ్చిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
లోకపాపములను మోసుకొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల
- మీకు స్తోత్రములు
1)
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పిన దేవా
- మీకు స్తోత్రములు
1)
కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేలమందికి పంచిపెట్టిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
దెయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
కుంటివారికి నడకనిచ్చిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
మూగవారికి మాటనిచ్చిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
గ్రుడ్డి వారికి చూపునిచ్చిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
కుష్టురోగులను బాగుచేసిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రము సెలవిచ్చి బాగుచేసిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
12 ఏండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగుచేసిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
- మీకు స్తోత్రములు
1)
18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగుచేసిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగుచేసిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
చనిపోయిన నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
చనిపోయిన లాజరును నాలుగు రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
మా దోషములను బట్టి నలుగగొట్టబడిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేస్తున్న యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
మా దరిద్రతను కొట్టివేసి, మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి, మమ్మల్ని ఆశీర్వదించ డానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
మా పాపముల నిమిత్తం సిలువ శిక్షను అనుభవించి మా కోసం శిలువలో మరణించిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి, మా కోసం అర్ధాయువులో మరణించిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
సమాధిని గెలిచి, మరణపు ముల్లును విరిచి, మృత్యుంజయునిగా మూడవ దినాన తిరిగి లేచిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
యేసు రక్తము ద్వారా ప్రతి పాపమునుండి మమ్మల్ని పవిత్ర పరుస్తున్న దేవా
- మీకు స్తోత్రములు
1)
యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలుగజేసిన దేవా
- మీకు స్తోత్రములు
1)
యేసు రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా
- మీకు స్తోత్రములు
1)
యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా
- మీకు స్తోత్రములు
1)
అపవాది శక్తులపైన మాకు జయమిచ్చిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
అపవాది తలను శిలువలో చితకద్రొక్కిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
సాతానును మా కాళ్ల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కిస్తానన్న యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
మీ సిలువ మరణం చేత అపవాదిని, వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి, మాకు జయోత్సాహం ఇచ్చిన యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపచేయుచున్న పరిశుద్ధాత్మ దేవా
- మీకు స్తోత్రములు
1)
మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మ దేవా
- మీకు స్తోత్రములు
1)
సంభవింపబోవు సంగతులను మాకు తెలియజేయుచున్న పరిశుద్ధాత్మ దేవా
- మీకు స్తోత్రములు
1)
ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మ దేవా
- మీకు స్తోత్రములు
1)
సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవా
- మీకు స్తోత్రములు
1)
మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
పరలోకంలో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
ముత్యపు గుమ్మాలు కలిగి, బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోవుచున్న యేసయ్యా
- మీకు స్తోత్రములు
1)
పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్లుటకు త్వరలో రాబోవుచున్న యేసయ్యా
- మీకు స్తోత్రములు